![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు ' . ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 29 లో.. ధన హాస్పిటల్ లో ఉంటే రామలక్ష్మి అక్కడే ఉంటుంది. ఇక అదే సమయంలో సీతాకాంత్ కాల్ చేస్తుంటాడు. ధన తమ్ముడని తెలిసిపోయిందా అని రామలక్ష్మి ఆలోచించి కాల్ లిఫ్ట్ చేయదు.. అయినా పదే పదే ఫోన్ చేస్తూనే ఉంటాడు సీతాకాంత్.
ఆ తర్వాత సిరి వాళ్ళ అమ్మ శ్రీలత, అన్నయ్య సందీప్ ఇద్దరు మాట్లాడుకుంటారు. వాడు ఉన్నాడా పోయాడా? ఒకవేళ బ్రతికి ఉంటే బ్రతికి ఉన్నన్ని రోజులు వాడిలో భయం ఉండాలని సందీప్ తో శ్రీలత అంటుంది. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడే సిరి వస్తుంది. అమ్మ ధన రాలేదా? వచ్చాక నాకు చెప్తా అన్నావ్ కదా అని శ్రీలతని సిరి అడుగుతుంది. అతను రాలేదమ్మ చాలా సేపు చూసామని సందీప్ అంటాడు. దాంతో రాకపోవడమేంటి అన్నయ్య.. నాతో బయల్దేరానని చెప్పాడని సిరి అంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ పనిమీద వెళ్ళాడేమో, కాల్ చేయపోయావని సిరితో శ్రీలత అంటుంది. కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయడంలేదని సిరి అంటుంది. కంగారుపడకు.. బిజీగా ఉన్నాడేమో తొందరగానే వస్తాడని సిరికి శ్రీలత నచ్చజెప్పి పంపిస్తుంది. ఆ తర్వాత సందీప్ తో శ్రీలత మాట్లాడుతుంది. మనం వాడిని కొట్టించినట్టు ఎట్టి పరిస్థితులలో తెలియకూడదు ఎందుకంటే వాడి మీద సిరికి సానుభూతితో పాటు ప్రేమ పెరుగుతుందని అంటుంది. దానికి సరేనని సందీప్ అంటాడు. మరోవైపు హాస్పిటల్ లో ధన కోసం మాణిక్యం బయట ఏడుస్తుంటాడు. ఆ ఏడుపుకి లోపలి నుండి నర్స్ వచ్చి ఇలా అరవకూడదు పేషెంట్ డిస్టబ్ అవుతాడని చెప్తుంది. ఇక రామలక్ష్మి చెప్పడంతో మాణిక్యం సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత ధన ఫ్రెండ్ కి సిరి కాల్ చేసి ఏంటి ధన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అడుగగా.. అదేంటి ధనకి యాక్సిడెంట్ అయిన విషయం తెలియదా అని చెప్తాడు. అది తెలిసి షాక్ అయి హాస్పిటల్ అడ్రెస్ తెలుసుకుంటుంది. తొందరగా హాస్పిటల్ కి వెళ్తుంది.
మాణిక్యం ధన ఫ్రెండ్ ని అడిగి నిజం తెలుసుకుంటాడు. వెంటనే వారి అంతు చూద్దామని బయల్దేరి వెళ్తుండగా అప్పుడే అక్కడికి సిరి వస్తుంది. ధనకి ఎలా ఉందని ధన ఫ్రెండ్ ని సిరి అడుగుతుంది. ప్రేమిస్తే చంపేస్తారా అంటు సిరిపై కోపంతో ఊగిపోతుంటాడు మాణిక్యం. అప్పుడే రామలక్ష్మి వచ్చి అతడిని కూర్చోమని చెప్తుంది. ఆ తర్వాత సిరి దగ్గరికి రామలక్ష్మి వచ్చి.. తెలిసో తెలియకో మీరిద్దరు ప్రేమించుకున్నారు. అంత మాత్రానా ఇలా కొడతారా? మీ వాళ్ళకి నువ్వు ఇక్కడికి వచ్చావనే నిజం తెలియకముందే ఇక్కడి నుండి వెళ్ళిపో అని సిరితో రామలక్ష్మి అంటుంది. ధనకి ఏం అయిందోనని ప్రాణలని గుప్పిట్లో పెట్టుకొని వచ్చానని సిరి అంటుంది. దయచేసి ఇక్కడి నుండి వెళ్లు.. వాడిని నమ్ముకొని ఒక కుటుంబమే ఉంది. వాడికేమైనా అయితే ఈ కుటుంబం ఉంటుందో ఉండదో.. మా ధనను వదిలేయమని మీ అన్నయ్యతో చెప్పు అని రామలక్ష్మి అంటుంది. ఇక సిరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక తను వెళ్ళిపోయాక.. నన్ను అనవసరంగా ఆపావమ్మ లేకుంటే వాళ్ళని చంపేసేవాడిని అని మాణిక్యం అంటాడు. చంపాల్సింది వాళ్ళని కాదు నిన్ను. వాడికి డబ్బున్న అమ్మాయిని చూసి ప్రేమించమని చెప్పావ్ .. కానీ అలా చేస్తే ఇలా ప్రాణాల మీదకి వస్తుందని రామలక్ష్మి అంటుంది. ఏ కొడుకుకైన తండ్రి అలా చెప్తాడా అని మాణిక్యంతో అనగానే.. భాదగా ఉందమ్మ ఓ రెండొందలు ఇస్తే మళ్లీ వస్తానని మాణిక్యం అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |